నవలలు
నవలలు సాధారణంగా చాలా మంది రచయితలు వ్రాస్తూవుంటారు. నా రచనలు చదివిన సాహితీ మిత్రులు వాటిని వైవిధ్యమైన నవలలు అంటూవుంటారు. ఆ అంశముపై నా భావాలను 3వ ప్రపంచ తెలుగు మహా సభలలో వ్యక్తము చేసి హాజరయినవారి అభినందనలు పొందాను. నిజానికి నా దృష్టిలో పురాణం అనగా పూర్వం జరిగిందని, ఇతిహాసం అనగా ఈవిధంగా జరిగిందని, భాగవతం అనగా భవగతం అని అందు వలన ఇవన్నీ మన మానవ జాతి చరిత్రలని నేను నమ్మాను. కొందరు వాటన్నిటినీ పుక్కిట పురాణాలని అంటూవుంటారు-కల్పితాలు అనే భావనతో. కానీ ఈ చరిత్రలన్నీ షుమారు 5000 సంవత్సరాలకు పూర్వము జరిగినవే, బాషలకు లిపులొచ్చి 3600 సంవత్సరాల కాలం మాత్రమే, అందు వలన ఆ మధ్యకాలంలో చరిత్రలన్నీ కుటుంబ వారసత్వంగాను, గురువుల నుండి శిష్యులకు వాక్కు ద్వారా వ్యాపించుట వలన పుక్కిట పురాణాలయ్యాయి కానీ కల్పితాలు కావు. అందు వలన ఆ చరిత్ర భాగాలను అర్ధ శతానికి పైగా వైవిధ్య నవలలుగాను, సహస్రానికి అధికంగా కవితలను వ్రాశాను. అందు కొన్ని---