జన్మ భూమి – భారత భూమిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా అంగలూరు గ్రామం. ప్రక్కనే వున్న గుడ్లవల్లేరు తల్లిగారి స్వగ్రామం. బందా భరతాజీ, గుడ్లవల్లేటి కామేశ్వరమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. వీరి జననం 11 ఆగష్టు 1948వ సంవత్సరం. పితామహుడు ఆనాడు ఉపాధ్యాయుడు, చుట్టుపక్కల గ్రామాలకు ఖ్యాతి గాంచిన వైద్యుడు. మాతామహుడు ఓ ప్రముఖ వ్యవసాయదారుడు. దాదాపు 20 ఎకరాల్లో కష్టించి పనిచేసి పుట్లకొలదీ ధాన్యాన్ని పండించేవారు.
పరిచయం
జన్మ భూమి
నేను నా వాళ్ళు
నా అర్ధాంగి రాజ్యలక్ష్మి, సౌంప్రదాయాలను గౌరవించి అభరించే గృహిణి.
మా సంతానం లో అమ్మాయి పెద్దది, లక్ష్మ్మీకామేశ్వరి, కామర్స్ గ్రాడ్యుయేట్, గృహిణి. ఈమె భర్త శ్రీకేశిరాజు బుల్లి వేంకటాచలం, ఈయన సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలలో రిటైర్డు ఎక్జిక్యుటివ్ ఇంజనీయలర్. వీరి సంతానంలో అమ్మాయి లక్ష్మీ విహిత, యమ్.యస్, సినియర్ సాఫ్టవేర్ ఇంజనియర్(యు.యస్). ఈమె భర్త పోతాప్రగడ సాయి హర్షిత్, యం.యస్, ఎం.బి.ఏ సీనియర్ సాఫ్టవేర్ ఇంజనీయర్(యు.యస్). మా మనుమడు కేసిరాజువారి అబ్బాయి చి.సాయి రామ్ రోహిత్, బి.టెక్ (మెకానికల్) యం.బి.ఏ జర్మన్ ఫరమ్లో పర్యవేక్షణ.
మా పెద్దబ్బాయి బందా శ్రీనివాస దినకర్, యం.యస్.సి.. సీనియర్ లెక్చరర్, ఆయన భార్య అర్చన, గ్రాడ్యుయేట్, గృహిణి. వీరి సంతానం హర్ష వర్ధన్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, అమ్మాయి ఉజ్వల, టెన్తు క్లాసు చదువుతున్నారు.
మా చిన్నబ్బాయి బందా వేంకట సుధాకర్, యం.టెక్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఈయన భార్య శ్రీవల్లీ, యం.యన్.సి. బియిడి, సీనియర్ టీచర్. వీరి పిల్లలు మయూఖ, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, కృష్ణ మనోజ్, ఇంజనీరింగ్ ఫస్ట ఇయర్ చదువుతున్నారు.
విద్య
విద్య – ఉపాధ్యాయుడైన తండ్రిగారు పనిచేస్తున్న తేలప్రోలు గ్రామంలో అక్షరాభ్యాసం నుండి స్కూల్ ఫైనల్ వరకు విద్యాభ్యాసం. ఆపై విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజనీరింగ్ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత. ఏ.యమ్. ఐ.ఇ.లో ప్రవేశం (ఆగష్టు 1967) మరియు ఉద్యోగ ప్రాప్తి.
ఉద్యోగ పర్వం
- 1967–68: విజయవాడ బారేజ్ వద్ద వైడక్టు నిర్మాణంలో సైట్ ఇంజనీయరుగా నిర్మాణ పర్యవేక్షణ; వివిధ నిర్మాణ పనుల పర్యవేక్షణ
- 1968–69: వర్కు ఇనస్పెక్టర్‌గా నల్లగొండ జిల్లాలో పంట కాల్వల పర్యవేక్షణ; మైనర్ ఇరిగేషన్ టాంకుల పరిశీలన
- 1970–77: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ ఇంజనీయరుగా కృష్ణాజిల్లా డ్రయినేజ్ డివిజన్‌లో ఇరిగేషన్ డ్రైన్సు, కల్వర్టులు, బ్రిడ్జిలు, అవుట్‌ఫాల్ స్లూయిస్ల నిర్మాణ పర్యవేక్షణ
- 1977–84: గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో నాగార్జునసాగర్ కుడికాల్వల పనులు—ఇన్వెస్టిగేషన్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్
- 1984–90: గోదావరి డెల్టా పశ్చిమ విభాగంలో నీటిపారుదల నిర్వహణ, వరద పరిశీలన/నిరోధక పనులు; రైతులతో కలిసి నీరు అందించి పంట విజయాలు
- 1990–98: విజయవాడ ప్రత్యేక వరద పనుల డివిజన్—బుడమేరు మళ్లింపు కాల్వ వెడల్పు పనులు
- 1998–2005: బుడమేరు మళ్లింపు కాల్వలపై హెడ్ రెగ్యులేటర్/బ్రిడ్జిల నిర్మాణం, కాల్వ త్రవ్వకం పర్యవేక్షణ
- 2005–06: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరుగా పదోన్నతి; 26 జనవరి 2006న రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం స్వీకరణ; 31 ఆగష్టు 2006న పదవీ విరమణ
కృష్ణానదీ వరద నియంత్రణ పనుల పర్యవేక్షణ సర్వీసులో అత్యుత్తమ విధినిర్వహణ చేసినందుకు గానూ జనవరి 26వ తేదీ 2006వ సంవత్సరం రిపబ్లిక్ ‘డే’ దినోత్సవాన రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని జిల్లా కలక్టరుగారి ద్వారా స్వీకరణ
పదవీ విరమణ తరువాత
2007–08లో కన్సల్టెంటు ఇంజనీయరుగా నియామకం. కాల్వలలో వ్యర్థాలుగా మారిన నాచు/తూడు మొదలైన వాటిపై పరిశోధనా పత్రం విడుదల—వాటిని కంపోస్ట్, గ్యాస్, కాగితపు అట్టలుగా మార్చవచ్చనే సారాంశం.
ఆకాశ వాణిలో నా వాణిని సీనియర్ సిటిజన్ వాణిగా వినిపించాను, గ్రంధ సమీక్షలు చేశాను. దూరదర్శన్ లో ఇరిగేషన్ ,సీనియర్ సిటిజన్ సమశ్యలపై చర్చలు జరిపాము.
సంఘ సేవ & రచనా ప్రయాణం
1998–2006 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రమోటీ ఇంజనీయర్స్ అసోషియేషన్‌లో జనరల్ సెక్రటరీగా/ట్రెజరరుగా సేవ. 2009–2026 మధ్య లయన్స్ క్లబ్, సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ సంఘాలు; ఎక్స రే, సరసభారతి, శారదా స్రవంతి వంటి రచయితల సంఘాలలో వివిధ హోదాలలో పని. పత్రికలలో ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా, రచయితగా, కవిగా కృషి. ఆకాశవాణిలో గ్రంథ సమీక్షలు; దూరదర్శన్‌లో ఇరిగేషన్/సీనియర్ సిటిజన్ సమస్యలపై చర్చలు.
అభిరుచులు
ఇంటి శ్లాబు పైన 200 పైగా కుండీల్లో మల్లెలు, మందారాలు, గులాబీలు వంటి పూలు; చిక్కుడు, బెండ, దోస, ములగ వంటి కూరలు; ద్రాక్ష, పుచ్చ వంటి పండ్లు; తమలపాకులు మొదలైనవి స్వయంకృషితో పండించాను.